తితిదేను వైకాపా రాజకీయంగా వాడుకుంది: బొండా ఉమా

తితిదేను వైకాపా రాజకీయ అవసరాల కోసం వాడుకుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 27 May 2024 04:35 IST

మీడియాతో మాట్లాడుతున్న బొండా ఉమామహేశ్వరరావు

తిరుమల, న్యూస్‌టుడే: తితిదేను వైకాపా రాజకీయ అవసరాల కోసం వాడుకుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం ఐదేళ్లూ శ్రీవేంకటేశ్వర స్వామిని, తితిదేను రాజకీయంగా వాడుకుంది. ముఖ్యమంత్రి గాని, తితిదే ఛైర్మన్‌ గాని ఏరోజూ భక్తితో వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి దంపతులు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కలిసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని