గతంలో సీఎస్‌లెవరూ ఇలా వ్యవహరించలేదు

జవహర్‌రెడ్డిలా ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శీ వ్యవహరించలేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయని ఎక్స్‌ వేదికగా ఆదివారం దుయ్యబట్టారు.

Updated : 27 May 2024 05:51 IST

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి: జవహర్‌రెడ్డిలా ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శీ వ్యవహరించలేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయని ఎక్స్‌ వేదికగా ఆదివారం దుయ్యబట్టారు. బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉన్నతాధికారిపై ఆరోపణలు చేశారని, పరువునష్టం దావా వేస్తానంటున్నారే.. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించారా? అని నిలదీశారు. ‘శాసనసభలో ప్రజాప్రతినిధులు ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు. వ్యవసాయం, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, విద్య తదితర శాఖలకు కేటాయించిన నిధుల్ని మళ్లించే అధికారం మీకెవరిచ్చారు?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఆయన భూ కుంభకోణం తేలుస్తామని హెచ్చరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని ఎలా అనుమతించారు? రీసర్వేను బలవంతంగా ఎలా రుద్దుతారు? రాష్ట్రంలో రాజకీయ హింస జరుగుతుంటే అదుపు చేయడంలో విఫలమైన ఆయనకు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల ఫైలుపై అంత ఆత్రమెందుకో’ అని సోమిరెడ్డి మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని