వరదబాధిత హిమాచల్‌కు రూ.9 వేల కోట్లు ఇవ్వలేకపోయారు

గడచిన 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22 మందికి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు.

Updated : 27 May 2024 06:27 IST

మోదీపై రాహుల్‌ విమర్శ

శిమ్లా: గడచిన 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22 మందికి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. అయితే రుతుపవన వర్షాల కారణంగా వచ్చిన వరదలతో విపత్తును ఎదుర్కొన్న హిమాచల్‌ ప్రదేశ్‌కు సహాయంగా రూ.9 వేల కోట్లు మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌ సిర్‌మౌర్‌ జిల్లాలోని నహాన్, హమిర్‌పుర్‌ లోక్‌సభ అభ్యర్థి తరఫున ఉనాలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌ ఆదివారం ప్రసంగించారు. పర్వత ప్రాంత రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని దొంగిలించడానికి యత్నించారని ఆరోపించారు. శిమ్లా (ఎస్సీ) కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ సుల్తాన్‌పురికి మద్దతుగా రాహుల్‌ ప్రచారం నిర్వహించారు. యాపిల్‌ పళ్ల ధరలను గుప్పిట్లో పెట్టుకునేందుకు రాష్ట్రంలోని గోదాములన్నింటినీ మోదీ ఒకే వ్యక్తికి కట్టబెట్టారని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని శీతల గిడ్డంగులన్నీ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ నియంత్రణలో ఉన్నాయి. అదానీకి మోదీ సహాయపడాలని దేవుడు కోరుకున్నాడేమోనని ఆక్షేపించారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారని రాహుల్‌ విమర్శించారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోబోదని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని