భాజపా పాలనలో ప్రజల జీవితాల్లో ప్రగతి లేదు: ప్రియాంక

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆదివారం విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక రంగం రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంటే ప్రజల జీవితాల్లో అభ్యున్నతి ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు.

Updated : 27 May 2024 05:48 IST

ఫతేగడ్‌ సాహిబ్, పటియాలా: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆదివారం విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక రంగం రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంటే ప్రజల జీవితాల్లో అభ్యున్నతి ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. పంజాబ్‌లోని ఫతేగడ్‌ సాహిబ్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి అమర్‌ సింగ్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రజలకు మోదీ అబద్ధాలు చెప్తూ, డొల్ల హామీలిస్తున్నారు’’ అని ప్రధానిని విమర్శించారు. దేశంలో 70 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని ఇది 45 ఏళ్లలోనే అత్యధికం అంటూ కేంద్రప్రభుత్వాన్ని ఆక్షేపించారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పంజాబ్‌లో మహిళలకు రక్షణలేని విషయంపైనా, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్య పెరిగిపోతుండటంపైనా, ప్రజా సమస్యలపైనా, దవ్యోల్బణం, నిరుద్యోగాన్ని తగ్గించడంపైనా స్పందించరంటూ భాజపా నేతలపై ప్రియాంక విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని