శ్రీధర్‌రెడ్డి హత్యకేసుపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

వనపర్తి జిల్లా కొల్లాపూర్‌లో భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేత, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం డీజీపీ రవిగుప్తాను కలిసి కోరారు.

Published : 28 May 2024 03:08 IST

డీజీపీ రవిగుప్తాను కోరిన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లా కొల్లాపూర్‌లో భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేత, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం డీజీపీ రవిగుప్తాను కలిసి కోరారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రే హోంశాఖ మంత్రిగా ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఆయనదేనన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్యకేసును ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తుసంస్థను ఏర్పాటు చేయాలని డీజీపీని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని