పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరిస్తున్న అమిత్‌ షా : కేజ్రీవాల్‌

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బెదిరిస్తున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సోమవారం ఆరోపించారు. ‘పంజాబ్‌ ప్రజలంతా భాజపా లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాలి.

Published : 28 May 2024 04:18 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బెదిరిస్తున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సోమవారం ఆరోపించారు. ‘పంజాబ్‌ ప్రజలంతా భాజపా లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాలి. కమలదళం విజయం సాధించిన తరవాత భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు’ అని ఆదివారం లుధియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌ షా వ్యాఖ్యానించారు. దీనిపై కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలారా..అమిత్‌ షా మాటలు విన్నారా? ఆయన బెదిరిస్తున్నారు. జూన్‌ 4 తరవాత భగవంత్‌ మాన్‌ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగరట. మనకు 92 మంది శాసనసభ్యులున్నారు. అలాంటప్పుడు ఎలా కూలుస్తారు? దేశంలో నియంతృత్వం సాగుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు