మతపరమైన రిజర్వేషన్లను అనుమతించేది లేదు: నడ్డా

భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం దేశంలో మతపరమైన రిజర్వేషన్లను అనుమతించబోమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టంచేశారు.

Published : 28 May 2024 04:19 IST

వారణాసి: భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం దేశంలో మతపరమైన రిజర్వేషన్లను అనుమతించబోమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను లాక్కోవడాన్ని అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీకి మద్దతుగా సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నడ్డా ప్రసంగించారు. అక్కడ ఉన్న కాలభైరవ ఆలయంలో ప్రార్థనలు చేశారు. 400 లోక్‌సభ స్థానాలు గెలిచి మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని