తాలిబన్‌ పాలన యోచనలో ఇండియా కూటమి: యోగి

ఇండియా కూటమిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం విమర్శలు గుప్పించారు. కూటమికి చెందిన పార్టీలు దేశంలో తాలిబన్‌ పాలనను తీసుకురావాలని యోచిస్తున్నాయని ఆరోపించారు.

Published : 28 May 2024 04:20 IST

మవూ: ఇండియా కూటమిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం విమర్శలు గుప్పించారు. కూటమికి చెందిన పార్టీలు దేశంలో తాలిబన్‌ పాలనను తీసుకురావాలని యోచిస్తున్నాయని ఆరోపించారు. ఘోసీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలది ప్రతికూల దృక్పథమని పేర్కొన్నారు. ‘‘ఆ పార్టీల సిద్ధాంతం.. శ్రీ రాముడు, దేశం, దళితులు, బలహీన వర్గాల హక్కులకు వ్యతిరేకం. ఇప్పుడు ఓబీసీల రిజర్వేషన్లలో ముస్లింలను భాగస్వాములను చేసేందుకు యోచిస్తున్నారు. దీన్ని మేం జరగనివ్వం’’ అని యోగి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని