హిమాచల్‌ సర్కారును కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ సర్కారును కూలదోసేందుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అన్ని ప్రయత్నాలూ చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు.

Updated : 28 May 2024 05:46 IST

భాజపాపై ప్రియాంక ఆరోపణ 

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ సర్కారును కూలదోసేందుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అన్ని ప్రయత్నాలూ చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భాజపా నాయకులు అవినీతికి పాల్పడటం, ముడుపులు ఇవ్వడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి ఎలాంటి పనికైనా తెగిస్తారని విమర్శించారు. భాజపా హిమాచల్‌లో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చిందని, వారిని దొంగల్లా రాత్రిళ్లు దాచిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు. హిమాచల్‌లోని చంబా, కాంగ్రా ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన ర్యాలీల్లో ఈ మేరకు ఆమె మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని