37 మంది తెదేపా నాయకులపై హత్యాయత్నం కేసులు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటన తర్వాత జరిగిన అల్లర్లపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

Published : 28 May 2024 05:00 IST

పులివర్తి నానిపై దాడి అనంతర   ఘటనలపై వైకాపా ఫిర్యాదుతో..
13 రోజుల తర్వాత ఫిర్యాదు.. గంటల్లోనే 
తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటన తర్వాత జరిగిన అల్లర్లపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 14న ఘటన జరగ్గా మంగళం తిరుమలనగర్‌ పంచాయతీకి చెందిన వైకాపా వర్గీయుడు ఎ.రాజీవ్‌ 13 రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం ఎస్వీయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పోలీసులు చంద్రగిరి, తిరుపతిలోని 37 మంది తెదేపా నాయకులతో పాటు మరికొందరిపై తీవ్రమైన సెక్షన్లతో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, గణపతిరెడ్డి ఆధ్వర్యంలో సమ్మెట, రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వర్సిటీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొన్ని వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై ఎస్వీయూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నానిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి వైకాపాకు చెందిన 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అల్లర్లు, విధ్వంసాలకు సంబంధించిన మరో కేసులో 11 మందిని గుర్తించి 41ఏ నోటీసులు అందజేశారు. రాజీవ్‌ నుంచి తాజాగా ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్పటికప్పుడే 147, 148, 323, 324, 307, 120బి, 506, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత తెదేపా నాయకులు మాటలు, చేతల ద్వారా తనతోపాటు తమ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని