నవీన్‌ పట్నాయక్‌ ఇక మాజీయే: అమిత్‌షా

ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాజీ కావడం ఖాయమని, 147 సీట్లున్న శాసనసభలో 75 స్థానాలతో విజయం సాధించబోయేది భాజపా మాత్రమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 29 May 2024 04:22 IST

భద్రక్‌/జాజ్‌పుర్, భువనేశ్వర్‌-న్యూస్‌టుడే: ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాజీ కావడం ఖాయమని, 147 సీట్లున్న శాసనసభలో 75 స్థానాలతో విజయం సాధించబోయేది భాజపా మాత్రమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విశ్వాసం వ్యక్తంచేశారు. ఒడిశాలోని భద్రక్‌ లోక్‌సభ స్థాన పరిధిలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. సంపదలకు నిలయమైన ఒడిశా- గత 25 ఏళ్లలో నవీన్‌ పట్నాయక్‌ పాలనలో పేదరికానికి చిరునామాగా మారిందని విమర్శించారు. ఇక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో 17 సీట్లు తమ పార్టీకి దక్కుతాయని చెప్పారు. ఒడియా భాషలో ప్రావీణ్యం ఉన్న నేత, ఇక్కడి సంస్కృతి-సంప్రదాయాలను అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఒడిశాకు తదుపరి సీఎంగా వస్తారని తెలిపారు. తెరవెనుక నుంచి ‘తమిళ బాబు’ ఇక్కడి సర్కారును నడపాల్సిన అగత్యం ఇకపై ఉండబోదన్నారు.  జాజ్‌పుర్‌లో జరిగిన మరోసభలో ఆయన ప్రసంగిస్తూ.. పీవోకేను భారత్‌లో విలీనం చేసి తీరుతామని మరోసారి హామీఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని