సల్వార్‌ కనుగొన్నవారికి సలాం

చీరలకు పుట్టినిల్లయిన భారత్‌లోనే వాటికి ఆదరణ కరవవుతోందంటూ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 29 May 2024 04:56 IST

పంజాబ్‌ మహిళలపై శశిథరూర్‌ ప్రశంసలు

చండీగఢ్‌: చీరలకు పుట్టినిల్లయిన భారత్‌లోనే వాటికి ఆదరణ కరవవుతోందంటూ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఇప్పుడు పంజాబ్‌ మహిళలు కనిపెట్టిన సల్వార్‌ కమీజ్‌ వైపే చూస్తోందన్నారు. ఇంతటి సౌకర్యవంతమైన దుస్తులు రూపొందించిన పంజాబ్‌ మహిళలను కచ్చితంగా అభినందించాల్సిందేనని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చండీగఢ్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌ మహిళలు ఎక్కువగా ధరించే సల్వార్‌ కమీజ్‌ గురించి ప్రస్తావించారు. తన సొంత రాష్ట్రం కేరళలోనూ ఇటీవల ఈ దుస్తులు విశేష ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. చక్కగా ఉండటమే కాకుండా సౌకర్యం కూడా దీనికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని