బెంగాల్‌లో ఆధిక్యం.. ఒడిశాలో అధికారం

‘‘పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అస్తిత్వం కోసం పోరాడుతోంది. అక్కడ హత్యలు, దాడులు సర్వసాధారణంగా మారాయి.

Published : 29 May 2024 04:57 IST

‘‘పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అస్తిత్వం కోసం పోరాడుతోంది. అక్కడ హత్యలు, దాడులు సర్వసాధారణంగా మారాయి. ఎన్నికల ముందు భాజపా కార్యకర్తలను జైళ్లలో బంధిస్తున్నారు. ఇన్ని అకృత్యాల మధ్య.. ప్రజలు ధైర్యంగా బయటకువచ్చి ఓటేస్తున్నారు. ఈసారి భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బెంగాల్‌ నిలవనుంది’’ అని మోదీ తెలిపారు. బెంగాల్‌లో జరిగిన మోసాలు, దారుణాలకు కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. ఓటుబ్యాంకు కోసం చివరికి కోర్టులను కూడా దూషించే స్థాయికి అక్కడి అధికార పార్టీ దిగజారిందని మండిపడ్డారు. ఒడిశాలో ప్రస్తుతమున్న ప్రభుత్వ గడువు జూన్‌ 4న ముగుస్తుందని, జూన్‌ 10న భాజపా సర్కారు ప్రమాణస్వీకారం చేయనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలకు పెద్ద శత్రువు కాంగ్రెస్‌ పార్టీయే అని విమర్శించారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొని ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారని, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అక్కడ మారిన పరిస్థితుల ఫలితాలు ఎన్నికల్లో కనిపించనున్నాయని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని