మాజీ ఎమ్మెల్యే బుల్లెబ్బాయిరెడ్డి కన్నుమూత

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి (70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Published : 29 May 2024 05:03 IST

కొత్తపల్లి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి (70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సంపర నియోజకవర్గంగా ఉన్న సమయంలో ఆయన రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1989లో ఒకసారి, 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ రీజినల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సముద్రకోత సమస్యకు పరిష్కారంగా యు.కొత్తపల్లి మండలంలో జియోట్యూబ్‌ నిర్మాణం జరిగింది. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న బుల్లెబ్బాయిరెడ్డి.. 2019లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కాకినాడ రూరల్‌ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో రాజకీయాలకు దూరం జరిగారు. ఆయనకు భార్య రత్నం, కుమారుడు కృష్ణారెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు