రీపోలింగ్‌ కోరలేదనడం సజ్జల దివాలాకోరుతనానికి నిదర్శనం: దేవినేని ఉమా

ఈవీఎంను ఎందుకు ధ్వంసం చేశావని పిన్నెల్లిని అడగకుండా, ఆ వీడియో బయటికెలా వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడగటం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Published : 29 May 2024 05:03 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఈవీఎంను ఎందుకు ధ్వంసం చేశావని పిన్నెల్లిని అడగకుండా, ఆ వీడియో బయటికెలా వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడగటం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. వైకాపా నేతలు దౌర్జన్యం చేసిన రోజే రీపోలింగ్‌ కోరినా, రీపోలింగ్‌ అడగలేదనడం సజ్జల దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం  దేవినేని విలేకర్లతో మాట్లాడారు. ‘సీఎస్‌ జవహర్‌రెడ్డిని పదవిలోంచి తొలగిస్తేనే లెక్కింపు సజావుగా సాగుతుంది. సీఎస్‌ భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపించాం. ఆయనపై మేం ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనడం సిగ్గుచేటు. వైకాపా పాలనలో వ్యవస్థలు ఎలా భ్రష్టు పట్టాయో చెప్పడానికి మాచర్లే ఉదాహరణ’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘వైకాపా నాయకులు ఈసీని, అధికారులను బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరు. వాళ్లు ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాక్కొస్తాం. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటికీ మూల్యం చెల్లిచుకోక తప్పదు’ అని దేవినేని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని