వైకాపాకు ఓటు వేయలేదని గిరిజనులపై దాడి

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదని ఇద్దరు గిరిజన యువకులపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పైనాపురం పంచాయతీ దేవరదిబ్బ గిరిజన కాలనీలో మంగళవారం జరిగింది.

Published : 29 May 2024 05:05 IST

ముత్తుకూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదని ఇద్దరు గిరిజన యువకులపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పైనాపురం పంచాయతీ దేవరదిబ్బ గిరిజన కాలనీలో మంగళవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఉన్న నరేశ్‌ను స్థానిక ఎస్సీ కాలనీలో వైకాపాకు చెందిన యువకులు పక్కకు తీసుకెళ్లి.. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశావని ప్రశ్నించారు. వైకాపాకే ఓటు వేశానని నరేశ్‌ చెప్పినా.. మీరు వైకాపాకు ఓటు వేయలేదు. అబద్ధాలు చెబుతున్నారు. మామాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు తెదేపాకు ఓటు వేస్తారా అని బెదిరిస్తూ మూకుమ్మడిగా దాడి చేయగా నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసి అక్కడికి వచ్చిన సోదరుడు సురేష్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం అతని కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముత్తుకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆసుపత్రిలో నరేష్, సురేష్‌లను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని