మాణిక్యరావుపై హత్యాయత్నం జరిగినా సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేయలేదు

ఎన్నికల్లో తెదేపా తరఫున బూత్‌ ఏజెంటుగా కూర్చున్నందుకే దళితుడైన నోముల మాణిక్యరావుపై వైకాపా నేతలు దాడి చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Updated : 29 May 2024 06:37 IST

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల్లో తెదేపా తరఫున బూత్‌ ఏజెంటుగా కూర్చున్నందుకే దళితుడైన నోముల మాణిక్యరావుపై వైకాపా నేతలు దాడి చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరి రూరల్‌ ఠాణాలో మాణిక్యరావు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఎస్‌ఐ నిరాకరించారని మండిపడ్డారు. ఈ మేరకు డీజీపీకి మంగళవారం లేఖ రాశారు. ‘ఉన్నతాధికారుల ఆదేశాలతో చేసేదేమీ లేక మంగళగిరి రూరల్‌ ఎస్‌ఐ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హత్యాయత్నం జరిగినా ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 307 నమోదు చేయకపోవడం చూస్తుంటే వైకాపావారితో ఎస్‌ఐకి  సంబంధాలున్నట్లు స్పష్టమవుతోంది. దళితుడైన మాణిక్యరావుపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న మంగళగిరి రూరల్‌ ఎస్‌ఐపై తగు చర్యలు తీసుకోవాలి’ అని వర్ల రామయ్య కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని