కంబోడియా బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి

కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు.

Updated : 29 May 2024 06:36 IST

సీఎస్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్, అమరావతి: కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ఆకర్షణీయమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించిన ఏజెన్సీల చేతిలో మోసపోయిన వందల మంది రాష్ట్ర యువత కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత యువతను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘యువతను ట్రాప్‌లోకి దించుతున్న ఏజెన్సీలను ఎన్‌ఐఏ దాడుల్లో గుర్తించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాధితులు కంబోడియా, లావోస్‌ ఇతర ప్రాంతాలనుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ దేశానికి వస్తున్నారు. అధికారులు కేంద్రంతో సంప్రదించి బాధితులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి’ అని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు