మా నాయకుడి వేషంలో మా పార్టీపై దుష్ప్రచారం

తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేసిన వైకాపా నాయకుడు రామాల మన్విత్‌ కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావులు సీఐడీ అధికారులను కోరారు.

Updated : 29 May 2024 06:35 IST

 వైకాపా నేతపై చర్యలు తీసుకోండి
 సీఐడీ అధికారులకు తెదేపా ఫిర్యాదు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేసిన వైకాపా నాయకుడు రామాల మన్విత్‌ కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావులు సీఐడీ అధికారులను కోరారు. తెదేపా లోగో, సైకిల్‌ గుర్తు గల బ్యాక్‌ డ్రాప్‌తో పసుపు కండువా ధరించి తెదేపా నాయకుడి మాదిరిగా కృష్ణారెడ్డి ప్రజల్లో తమ పార్టీ పట్ల వ్యతిరేక భావం కలిగేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని, ఎస్సీ, ఎస్టీలను కించపర్చే విధంగా మాట్లాడారని తెదేపా ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కోసం డీఐజీ కార్యాలయ అధికారులు గుంటూరు సీఐడీ డీఎస్పీ రమణకుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు. దర్యాప్తులో భాగంగా రామకృష్ణ, సుబ్బారావులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీ అధికారులకు మంగళవారం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని