‘మోదీజీ! స్నేహితుడన్నారు.. ఫోను చేసి కనుక్కోవచ్చుగా!’

భాజపాకు చెందిన ఒడిశా, దిల్లీ నేతలు చాలామంది తన ఆరోగ్యంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. నెల రోజులుగా ఎన్నికల ప్రచార నిమిత్తం రాష్ట్రమంతా తిరుగుతూ తాను బాగానే ఉన్నానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బుధవారం స్పష్టం చేశారు.

Published : 30 May 2024 04:51 IST

ప్రధానికి ఒడిశా సీఎం కౌంటర్‌

భాజపాకు చెందిన ఒడిశా, దిల్లీ నేతలు చాలామంది తన ఆరోగ్యంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. నెల రోజులుగా ఎన్నికల ప్రచార నిమిత్తం రాష్ట్రమంతా తిరుగుతూ తాను బాగానే ఉన్నానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బుధవారం స్పష్టం చేశారు. ‘‘నేను తనకు మంచి మిత్రుణ్నని ఆయన (ప్రధాని మోదీ) ఇంతకుముందు బహిరంగంగా చెప్పారు. నా ఆరోగ్యం గురించి అంత ఆందోళన చెందుతుంటే ఒక్కసారి నాకే ఫోను చేసి కనుక్కోవచ్చుగా! ఇదంతా వదంతుల వ్యాప్తిలో భాగం’’ అన్నారు. ఈ ప్రచారంపై నవీన్‌ పట్నాయక్‌ ‘ఎక్స్‌’ ద్వారా కూడా స్పందించారు. 4.5 కోట్ల ఒడిశా ప్రజలంతా తన కుటుంబమని.. రాష్ట్రంలోని తల్లులు, యువత జూన్‌ 1న జరిగే పోలింగు ద్వారా భాజపా దుష్ప్రచారానికి గట్టిగా బదులు చెప్పాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని