మోదీ దేవుడైతే గుడికట్టి ప్రసాదం ఇస్తా

దేశ ప్రయోజనం కోసం భగవంతుడే తనను పంపాడని ప్రధాని మోదీ ఇటీవల చెప్పడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Published : 30 May 2024 03:48 IST

ఆయన ఆలయంలో కూర్చోవాలి: మమత 

కోల్‌కతా: దేశ ప్రయోజనం కోసం భగవంతుడే తనను పంపాడని ప్రధాని మోదీ ఇటీవల చెప్పడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా మోదీ తనను దేవుడిగా భావించుకుంటే నాదొక విన్నపం. మోదీజీ! మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా ఢోక్లా (గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’’ అని దీదీ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బహిరంగ సభల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కోల్‌కతాలో శ్యాంబజార్‌ నుంచి స్వామి వివేకానంద పూర్వీకుల గృహం వరకు ఆమె రోడ్‌షో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు