ఎన్నికల్లో వ్యతిరేకంగా పని చేశారని దళిత కుటుంబంపై వైకాపా వర్గీయుల దాడి

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దళిత కుటుంబంపై ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు దాడి చేశారు.

Published : 30 May 2024 04:27 IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం  పొందుతున్న నాగమణి

ధర్మవరం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దళిత కుటుంబంపై ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా పనిచేస్తారా? అంటూ నాగమణి, ఆమె కుమారులు రామాంజనేయులు, నగేశ్‌పై వైకాపా వర్గీయులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో వైకాపా నాయకుడు సరితాల బాషా, అశోక్, సురేశ్, నరేశ్, పృథ్వీ పాల్గొన్నారని బాధితురాలు నాగమణి ధర్మవరం రెండో పట్టణ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన నాగమణి, ఆమె కుమారులు రామాంజనేయులు, నగేశ్‌ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైకాపాకు వ్యతిరేకంగా పని చేశారని బెదిరించడంతోపాటు తనను కులం పేరుతో బాషా, ఆయన అనుచరులు దూషించి దాడి చేశారని నాగమణి ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపావారిపై ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని