శంషాబాద్‌ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు విదేశీ పర్యటనను ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు.

Published : 30 May 2024 04:29 IST

విదేశీ పర్యటనను ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం విమానాశ్రయంలో నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు విదేశీ పర్యటనను ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు శంషాబాద్‌ విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు. చంద్రబాబు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారంతా సీఎం.. సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బొకేలతో ఆయనకు స్వాగతం పలకడానికి ఎగబడ్డారు. వారిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని