పోలింగ్‌ పూర్తికాకముందే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రసారం

పోలింగ్‌ ప్రక్రియ పూర్తికాకముందే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రసారం చేసినందుకుగాను ఒడిశాలో నందీఘోష టీవీపై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది.

Published : 30 May 2024 05:20 IST

ఒడిశాలో నందీఘోష టీవీపై చర్యలకు ఈసీ ఆదేశం 

దిల్లీ: పోలింగ్‌ ప్రక్రియ పూర్తికాకముందే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రసారం చేసినందుకుగాను ఒడిశాలో నందీఘోష టీవీపై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. ఆ ఛానెల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల్లో అన్ని విడతల పోలింగ్‌ పూర్తికాకముందే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను బయటపెట్టడం ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 126ఎ ప్రకారం నిషిద్ధం. సార్వత్రిక సమరంలో చివరిదైన ఏడో దశ ఓటింగ్‌ జూన్‌ 1న జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని