రాజమహేంద్రిలో ఎన్టీఆర్‌ తనయ అఖండ విజయం

చారిత్రక నగరం రాజమహేంద్రవరం నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా భాజపా తరఫున బరిలో నిలిచిన ఎన్టీఆర్‌ తనయ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు.

Published : 05 Jun 2024 05:05 IST

2.39 లక్షల ఓట్ల మెజార్టీతో పురందేశ్వరి గెలుపు

జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న పురందేశ్వరి

ఈనాడు, రాజమహేంద్రవరం: చారిత్రక నగరం రాజమహేంద్రవరం నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా భాజపా తరఫున బరిలో నిలిచిన ఎన్టీఆర్‌ తనయ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. లెక్కింపు ప్రారంభం నుంచి వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై ఆధిక్యం చాటారు. పోస్టల్, ఈవీఎంలలో మొత్తం 13,25,297 ఓట్లు నమోదవ్వగా.. ఆమెకు 7,26,515 (54.82%) వచ్చాయి. దీంతో 2,39,139 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ విజయం బాధ్యతను గుర్తు చేస్తుంది

‘ఈ అఖండ విజయం మా బాధ్యతను గుర్తు చేస్తుంది. అయిదేళ్ల విద్వేషపూరిత పాలనలో ప్రజలు ఇబ్బందులు పడడం వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. వారి ఆకాంక్షల మేరకు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తాం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఎన్డీయేకు అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపు రాష్ట్రాభివృద్ధిపై మా బాధ్యతను మరింత పెంచింది’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని