కేసీఆర్‌ ఓడించాలన్నా.. ప్రజలు ఆశీర్వదించారు: సంజయ్‌

‘‘నన్ను ఓడించేందుకు మైనార్టీలంతా ఏకం కావాలని కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చినా ప్రజలంతా ఏకమై భారీ మెజారిటీతో నన్ను గెలిపించి.. ఆయన అడ్రస్‌నే గల్లంతు చేశారు’’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Published : 05 Jun 2024 05:07 IST

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ‘‘నన్ను ఓడించేందుకు మైనార్టీలంతా ఏకం కావాలని కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చినా ప్రజలంతా ఏకమై భారీ మెజారిటీతో నన్ను గెలిపించి.. ఆయన అడ్రస్‌నే గల్లంతు చేశారు’’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా. ప్రధాని మోదీ హవాతోనే ఇంత మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రజల తరఫున పోరాడతా’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని