విజయసాయికి ప్రత్యక్ష రాజకీయాల దెబ్బ

వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు లోక్‌సభ స్థానంలో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

Published : 05 Jun 2024 05:07 IST

నెల్లూరులో పోటీ.. పలకరించిన ఓటమి  

నెల్లూరులోని లెక్కింపు కేంద్రంలోంచి ఓటమి బాధతో వస్తున్న విజయసాయిరెడ్డి 

ఈనాడు, అమరావతి: వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు లోక్‌సభ స్థానంలో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ-2గా, సీఎంకు అత్యంత సన్నిహితుడిగా సాయిరెడ్డి దిల్లీలో ఆయనకు రాజకీయ లాబీయింగ్‌ చేస్తూ వచ్చారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అనుకున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీని వీడి తెదేపాలో చేరడంతో...ఆ సీటును తమ బంధువులకు ఇప్పించుకునేందుకు సాయిరెడ్డి ప్రయత్నించారు. ‘వాళ్లెందుకు నువ్వే పోటీ చేయన్నా’ అని జగన్‌ బలవంతం చేస్తే విధిలేని పరిస్థితుల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ జిల్లా వైకాపాకు కంచుకోట అని.. స్వీప్‌ చేస్తామని ధీమానూ వ్యక్తం చేశారు. కానీ ఫలితం తిరగబడింది. 

సుబ్బారెడ్డి సేఫ్‌

జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. సర్దుబాటు కాకపోవడంతో టికెట్‌ ఇవ్వట్లేదంటూ జగన్‌ ఆయన్ను రాజ్యసభకు పంపారు. సుబ్బారెడ్డి పోటీ చేయకపోవడమే మంచిదయిందని, ఈ పరాభావం నుంచి తప్పించుకోగలిగారని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని