కాంగ్రెస్‌ బలాన్ని తగ్గించాలని.. భాజపాకు సహకరించిన భారాస

రాష్ట్రంలో కమ్యూనిస్టులకు బలం ఉన్న ప్రతిచోటా కాంగ్రెస్‌ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 05 Jun 2024 05:07 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కమ్యూనిస్టులకు బలం ఉన్న ప్రతిచోటా కాంగ్రెస్‌ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌ బలాన్ని తగ్గించేందుకు భారాస పరోక్షంగా భాజపాకు సహకరించిందని వ్యాఖ్యానించారు. ఫలితంగా భారాస ఓట్లలో చాలావరకు భాజపాకు బదిలీ అయ్యాయని, ఆ పార్టీకి 8 సీట్లు వచ్చాయని అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మగ్దుంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నైతిక విజయం ఇండియా కూటమిదే: నారాయణ

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ‘‘భారాస బలం తగ్గడం వల్లే భాజపాకు తెలంగాణలో సీట్లు పెరిగాయి. కాంగ్రెస్‌ ఏకపక్ష వైఖరితో సొంతంగా పోటీ చేసింది. ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని మంగళవారం ఓ వీడియో ప్రకటనలో నారాయణ పేర్కొన్నారు. ఏపీలో గెలిచిన తెదేపా కూటమికి అభినందనలు తెలిపారు. నియంతృత్వం, అవినీతి, కక్షసాధింపు చర్యలతో జగన్‌ ఓటమిపాలయ్యారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని