అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన సామగ్రిని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి మంగళవారం లారీల్లో తరలించారు.

Published : 05 Jun 2024 05:08 IST

వాహనాల్లో తరలిస్తున్న సామగ్రి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన సామగ్రిని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి మంగళవారం లారీల్లో తరలించారు. ఈనెల 9న ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం. దీంతో 12 లారీల్లో వచ్చిన భారీ టెంట్లు, స్టేజీ నిర్మాణం ఇతర సామగ్రిని రాయపూడి సీడ్‌యాక్సెస్‌ మార్గంలో ఉంచారు. ప్రమాణస్వీకారం ఎక్కడ నిర్వహించాలన్న విషయమై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడికి తరలించేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారుల వాహనాలకు పార్కింగ్‌ తదితర అవసరాలకు వందల ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో బుధవారం స్థల పరిశీలన చేసి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెదేపా నేత ఒకరు తెలిపారు. కూటమి విజయాన్ని ముందుగానే ఊహించిన నేతలు.. ప్రమాణస్వీకారానికి వెంటనే ఏర్పాట్లు చేయడానికి వీలుగా హైదరాబాద్‌ నుంచి ఓ ఈవెంట్‌ ఏజెన్సీ నుంచి సామగ్రి తరలించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు