ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు షాక్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు ఓటమి తప్పలేదు. పార్లమెంటులో అడుగుపెట్టాలన్న వారి ఆశలు నెరవేరలేదు.

Published : 05 Jun 2024 05:09 IST

భాజపా అభ్యర్థుల చేతిలో తప్పని ఓటమి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు ఓటమి తప్పలేదు. పార్లమెంటులో అడుగుపెట్టాలన్న వారి ఆశలు నెరవేరలేదు. సికింద్రాబాద్‌ నుంచి భారాస తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన టి.పద్మారావు అదే పార్టీ నుంచి సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి భారాస తరఫున గెలుపొందిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ బరిలో నిలిచారు. వారిద్దరూ భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ ఐఏఎస్‌ అధికారి, భారాస ఎమ్మెల్సీ టి.వెంకట్రామిరెడ్డి ఈసారి మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా.. అదే పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి రెండో స్థానం దక్కింది. వెంకట్రామిరెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దించింది. భాజపా అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని