లోక్‌సభ ఫలితాల్లో రాజకీయ కుటుంబాల హవా

లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు మంచి ఫలితాలను సాధించాయి. ఎక్కువమంది తాము పోటీ చేసిన స్థానాల్లో విజయం సాధించారు.

Published : 05 Jun 2024 05:09 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు మంచి ఫలితాలను సాధించాయి. ఎక్కువమంది తాము పోటీ చేసిన స్థానాల్లో విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబం నుంచి ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌తో సహా అయిదుగురు పోటీ చేయగా అందరూ ఘన విజయం సాధించారు. బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ కుమార్తెలు ఇద్దరూ పోటీ చేయగా మీసా భారతి గెలుపొందారు. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, జేడీఎస్‌ అభ్యర్థి కుమారస్వామి,  దేవేగౌడ అల్లుడు, భాజపా అభ్యర్థి మంజునాథ్‌ ఇద్దరూ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ పరాజయం చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని