ఎన్డీయే బాధ్యత పెరిగింది

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఎన్డీయేకు అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Published : 05 Jun 2024 05:10 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఎన్డీయేకు అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపుపై ఆమె మంగళవారం రాత్రి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘ఎన్డీయే అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఈ గెలుపు రాష్ట్రాభివృద్ధిపై మా బాధ్యతను మరింత పెంచింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి చర్యలు తీసుకుంటుంది. నన్ను రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిగా గెలిపించినందుకు ఓటర్లకు నమస్సులు. నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతా’నని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని