రాష్ట్రం గెలిచింది.. ప్రజలు గెలిపించారు

‘ఆంధ్రప్రదేశ్‌ గెలిచింది. ప్రజలు గెలిపించారు. చివరి ఓటు పడేవరకూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీ శ్రేణుల కృషి, అంకితభావాల ఫలితమే ఈ ఘనవిజయం’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Updated : 05 Jun 2024 07:45 IST

మోదీ, అమిత్‌ షా, పవన్, పురందేశ్వరికి చంద్రబాబు ధన్యవాదాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌ గెలిచింది. ప్రజలు గెలిపించారు. చివరి ఓటు పడేవరకూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీ శ్రేణుల కృషి, అంకితభావాల ఫలితమే ఈ ఘనవిజయం’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన ప్రజలకు, అచంచల నిబద్ధతను ప్రదర్శించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించడంపై ఆయన ఎక్స్‌ వేదికగా మంగళవారం స్పందించారు. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాం. అందరం కలిసి ఏపీని పునర్నిర్మిద్దాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు