జగన్‌ విధ్వంసకర పాలనకు గుణపాఠం

జగన్‌ విధ్వంసకర పాలనకు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని హిందూపురం హ్యాట్రిక్‌ విజేత నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated : 05 Jun 2024 07:46 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: జగన్‌ విధ్వంసకర పాలనకు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని హిందూపురం హ్యాట్రిక్‌ విజేత నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఫలితాల తర్వాత బాలకృష్ణ మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి విజయవాడ విమానాశ్రయానికి రాగా.. అతని సన్నిహితుడు బొర్రా గాంధీ నేతృత్వంలోని తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం బాలకృష్ణ రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. ఎయిర్‌ పోర్టులో మాట్లాడుతూ.. ‘జగన్‌ అసలు నైజాన్ని గమనించి ఈసారి జనం ఓడించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. పవన్‌కల్యాణ్‌ మాతో చేతులు కలిపి మంచి మెజార్టీకి కారణమయ్యారు. చంద్రబాబు విజన్‌ ప్రపంచానికే ఓ బ్రాండ్‌. రేపటి నుంచి ఆయన రాష్ట్రాభివృద్ధికి పని చేస్తుంటార’ని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని