రుషికొండపై జెండా ఎగరేసిన తెదేపా శ్రేణులు

సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయంతో రుషికొండ భవనాలపై తెదేపా అభిమానులు కొందరు మంగళవారం పార్టీ జెండాలు ఎగరవేశారు.

Published : 05 Jun 2024 05:22 IST

రుషికొండపై నిర్మాణ భవనాలు ఎక్కి తెదేపా జెండాలు ఎగుర వేస్తున్న పార్టీ అభిమానులు

ఈనాడు, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయంతో రుషికొండ భవనాలపై తెదేపా అభిమానులు కొందరు మంగళవారం పార్టీ జెండాలు ఎగరవేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రుషికొండ విధ్వంసానికి తెరలేపిన విషయం తెలిసిందే. బాగున్న పర్యాటక భవనాలు కూలగొట్టి, సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో రూ.450 కోట్లతో విలాసవంతమైన భవనాలు నిర్మించింది. వాటి వద్దకు ఇప్పటివరకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఇద్దరు.. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులను తప్పించుకుని కొండపై ఉన్న భవనంపై ఎక్కి విజయ సంకేతంగా జెండాలు ప్రదర్శించారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని అరిలోవ స్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని