మహారాష్ట్రలో ఎన్డీయేకి షాక్‌

మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఎన్డీయే బలం సగానికి పైగా తగ్గిపోయింది.

Published : 05 Jun 2024 05:42 IST

ముంబయి: మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఎన్డీయే బలం సగానికి పైగా తగ్గిపోయింది. మహావికాస్‌ అఘాడీగా పోటీచేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 29 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక చోట ఆధిక్యంలో ఉంది. సాంగ్లీ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ విశాల్‌ పాటిల్‌ విజయం సాధించారు.  ఎన్డీయే కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది.  ఏడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌ బారామతి స్థానం నుంచి శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలె చేతిలో ఓటమిని చవిచూడటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని