ఎడారి రాష్ట్రంలో భాజపాకు చుక్కెదురు

రాజస్థాన్‌లో భాజపా-కాంగ్రెస్‌ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. 2019లో ఇక్కడి 25 పార్లమెంట్‌ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా ఈసారి చతికిలబడింది.

Published : 05 Jun 2024 05:43 IST

(రాజస్థాన్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

జైపుర్‌: రాజస్థాన్‌లో భాజపా-కాంగ్రెస్‌ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. 2019లో ఇక్కడి 25 పార్లమెంట్‌ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా ఈసారి చతికిలబడింది. కేవలం 14 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విపక్ష ‘ఇండియా’ కూటమి 11 స్థానాలు గెలుచుకుంది. కూటమిలోని కాంగ్రెస్‌కు 8.. సీపీఐ(ఎం), భారత్‌ ఆదివాసీ పార్టీ(బీఏపీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ)లు తలా ఒకటి దక్కించుకున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోని కాంగ్రెస్‌.. ఈసారి సొంతంగా 8కి బలోపేతం కావడం గమనార్హం. భాజపా నుంచి విజయం సాధించిన వారిలో కేంద్ర మంత్రులు మేఘవాల్‌ 55,711 ఓట్లు, భూపేంద్ర యాదవ్‌ 48,282, మాజీ సీఎం వసుంధరా రాజె కుమారుడు 3,70,989 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. బాన్స్‌వారా జిల్లాలోని బగిదోరా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఏపీ అభ్యర్థి గెలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని