‘నోటా’కు తగ్గాయి

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరూ ఓటరుకు నచ్చకపోతే ఆ విషయాన్ని తెలియజేసేందుకు 2013లో కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) అనే ఐచ్ఛికానికి ఓటు వేసే అవకాశం కల్పించింది.

Published : 05 Jun 2024 06:28 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరూ ఓటరుకు నచ్చకపోతే ఆ విషయాన్ని తెలియజేసేందుకు 2013లో కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) అనే ఐచ్ఛికానికి ఓటు వేసే అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈవీఎంలలో దీనికీ ఓ బటన్‌ పెట్టింది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్ల కంటే 2024 ఎన్నికల్లో ఓట్ల శాతం స్వల్పంగా తగ్గింది. 2019లో నోటాకు 4,01,315 ఓట్లు రాగా.. ఈసారి ఎన్నికల్లో 3,69,285 ఓట్లు పోలయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు