మెరుగైన వామపక్షాలు...

వామపక్షాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరుని కొద్దిగా మెరుగుపర్చుకున్నాయి. ‘ఇండియా’ కూటమిలో భాగంగా బరిలో దిగిన వామపక్షాలు.. ఈసారి 8 స్థానాల్ని దక్కించుకున్నాయి.

Published : 05 Jun 2024 06:33 IST

దిల్లీ: వామపక్షాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరుని కొద్దిగా మెరుగుపర్చుకున్నాయి. ‘ఇండియా’ కూటమిలో భాగంగా బరిలో దిగిన వామపక్షాలు.. ఈసారి 8 స్థానాల్ని దక్కించుకున్నాయి. 17వ లోక్‌సభకు సీపీఐ(ఎం) ముగ్గురు ఎంపీలనూ, సీపీఐ ఇద్దరు ఎంపీల్ని పంపాయి. వాటిలో నాలుగు స్థానాలు తమిళనాడులో, ఒకటి కేరళలో ఉన్నాయి. ఈసారి లెఫ్ట్‌ పార్టీల ప్రాతినిధ్యం మరో రెండు రాష్ట్రాలకు పెరిగింది. బిహార్‌లో.. సీపీఐ(ఎంఎల్‌) రెండు సీట్లు గెలుచుకోగా.. సీపీఎం అనూహ్యంగా రాజస్థాన్‌లో గెలిచింది. అక్కడ సికార్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అమ్రా రామ్‌ గెలిచారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి తమిళనాడులో సీపీఎం, సీపీఐ చెరో రెండు సీట్లు గెల్చుకున్నాయి. కేరళలో సీపీఎం ఓ స్థానాన్ని గెలిచింది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా వామపక్షాలు ఒకప్పటి తమ కంచుకోట పశ్చిమ బెంగాల్‌లో ఒక్క సీటూ గెలవలేకపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు