కూటమి విజయంపై విదేశాల్లో సంబరాలు

ఏపీలో ఎన్డీయే ఘనవిజయంపై దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాలోని పలు నగరాల్లో కేక్‌లు కట్‌చేసి, శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించారు.

Updated : 05 Jun 2024 08:55 IST

న్యూజెర్సీలో తెదేపా పతాకంతో జగదీశ్, ప్రవాసాంధ్రులు 

హైదరాబాద్, అమరావతి, న్యూస్‌టుడే: ఏపీలో ఎన్డీయే ఘనవిజయంపై దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాలోని పలు నగరాల్లో కేక్‌లు కట్‌చేసి, శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించారు. అమెరికాలోని న్యూజెర్సీలో డాక్టర్‌ జగదీశ్‌ ఎలమంచిలి ఆధ్వర్యంలో వేడుకలు న్యూజెర్సీ, న్యూయార్క్‌లోని తెలుగు సంఘాల వారి తరఫున.. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో విద్య గార్లపాటి, వెంకీ, లక్షీ దేవినేని, బిందు, శివకుమార్, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చైనాలో గ్వాంగ్‌జౌలో విజయోత్సవాలు నిర్వహిస్తున్న తెదేపా అభిమానులు 

  • ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయవరం గ్రామానికి చెందిన యర్రమోసు సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో మిచిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ సిటీలో ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన తెదేపా అభిమానులు విజయోత్సవాలు నిర్వహించారు. గింజిపల్లి శ్రీహర్ష, యర్రమోసు అజయ్‌చౌదరి, గన్నమనేని శ్రీహర్ష, అన్వేశ్, శ్రీరాము, వినయ్, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 
  • తెలుగువారు అధికంగా ఉండే టెక్సాస్‌ రాష్ట్రంలో హ్యూస్టన్‌లో ప్రవాసాంధ్రులు కేరింతలు, నృత్యాలతో ఆనందాన్ని వ్యక్తంచేశారు.
  • ఏపీలో కూటమి విజయం సాధించడంతో చైనాలోని గ్వాంగ్‌జౌలో తెలుగు కుటుంబాలు విజయోత్సవాలు నిర్వహించుకున్నాయి. ఈ వేడుకలో ప్రశాంత్, వైష్ణవి, సతీష్, సంధ్య, భానుచందర్, లావణ్య, దుర్గప్రసాద్, సుజిత చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అమెరికాలోని హ్యూస్టన్‌ సంబరాల్లో ప్రవాసాంధ్రులు 

మెల్‌బోర్న్‌లో ప్రవాసాంధ్రుల విజయోత్సవాలు

ఏపీలో ఎన్డీయే విజయంపై ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వినుకొండకు చెందిన ఎన్నారై లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు విజయోత్సవాలు జరిపారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి ఖర్చుకు వెనుకాడకుండా తాము స్వగ్రామాలకు వచ్చి ఓట్లు వేశామని గుర్తుచేశారు. 

న్యూస్‌టుడే, వినుకొండ గ్రామీణ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు