జగన్‌ మేనమామపై మంచిర్యాల అల్లుడి విజయం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లా కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి అల్లుడు (చిన్న కుమార్తె శ్రీచైతన్య భర్త).

Published : 05 Jun 2024 06:36 IST

మంచిర్యాల అర్బన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లా కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి అల్లుడు (చిన్న కుమార్తె శ్రీచైతన్య భర్త). వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మేనమామ, సిటింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై కృష్ణచైతన్య రెడ్డి గెలుపొందారు. ఆయన విజయం పట్ల అరవిందరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందం వెల్లివెరిసింది. కృష్ణచైతన్య రెడ్డి తండ్రి పుత్తా నర్సింహారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో నర్సింహారెడ్డికి బదులు తెదేపా అధిష్ఠానం కృష్ణచైతన్య రెడ్డిని బరిలో నిలిపింది. కృష్ణచైతన్య రెడ్డితో శ్రీచైతన్యకు 2013లో వివాహమైంది. వారికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని