చిన్న పార్టీల ప్రభావం నామమాత్రం

రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చిన చిన్న పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో ఏమాత్రం తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి.

Published : 05 Jun 2024 06:37 IST

ఒక్కరికీ డిపాజిట్లు దక్కలేదు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చిన చిన్న పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో ఏమాత్రం తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఆయా పార్టీల వ్యవస్థాపక అధ్యక్షులు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. ఆ పార్టీల తరఫున లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారిలో ఎవరికీ డిపాజిట్లు దక్కలేదు. ప్రధాన పార్టీల విజయావకాశాలను వీరు ప్రభావితం చేయలేకపోయారు. 

  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్‌ నేషనల్‌ పార్టీని కొద్ది నెలల ముందు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన విశాఖ లోక్‌సభకు పోటీ చేయడంతో పాటు మరో 5 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు. వారెవరూ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేదు. గత ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి 2,88,874 ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 5,085 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
  • భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై)ని ప్రకటించిన రామచంద్ర యాదవ్‌ కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆయన పుంగనూరు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయడంతో
  • పాటు.. మరో 30 చోట్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి, సుమారు 16 వేల ఓట్లు సాధించిన ఆయన.. ఇప్పుడు రెండుచోట్లా ప్రభావం చూపలేకపోయారు. పుంగనూరులో 4,363, మంగళగిరిలో 373 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఆయన పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థులదీ అదే పరిస్థితి. 
  • జడ శ్రావణ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన జై భీమ్‌ పార్టీ కూడా ప్రభావం చూపలేదు. ఆ పార్టీ అధినేత పోటీ చేసిన తాడికొండలో 71, మంగళగిరిలో 416 ఓట్లు వచ్చాయి. 
  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విశాఖ లోక్‌సభ, గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. అసెంబ్లీ స్థానానికి 1,590, లోక్‌సభ స్థానానికి 7,390 ఓట్లు సాధించగలిగారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు