తొలి అడుగే లోక్‌సభలోకి..

రాజకీయాల్లో సర్పంచి నుంచి ఒక్కోమెట్టు ఎదుగుతూ ఉంటే ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఎంపీ సీటులో పోటీకి సదరు నేతను పరిగణనలోకి తీసుకుంటారు.

Published : 05 Jun 2024 06:54 IST

ఐదుగురు అభ్యర్థులను వరించిన విజయం

ఈనాడు, హైదరాబాద్‌: రాజకీయాల్లో సర్పంచి నుంచి ఒక్కోమెట్టు ఎదుగుతూ ఉంటే ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఎంపీ సీటులో పోటీకి సదరు నేతను పరిగణనలోకి తీసుకుంటారు. అలా కాకుండా నేరుగా ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తే నిజంగా అది జాక్‌పాటే. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేందుకు అవకాశం లభించిన అభ్యర్థుల్లో ఐదుగురు విజయం సాధించారు.

  • నల్గొండ విజేత కుందూరు రఘువీర్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడిగానే అందరికీ తెలుసు. వ్యాపార వ్యవహారాలు చూసుకునే ఆయన నేరుగా ఎంపీ స్థానంలో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి లోక్‌సభలోకి అడుగు పెడుతున్నారు. 
  • ఖమ్మంలో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పారిశ్రామికవేత్త. మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి తనయునిగా గుర్తింపు ఉంది. మొదటిసారి పోటీ చేసి భారీ ఆధిక్యం సాధించారు. 
  • పెద్దపల్లిలో విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు. తండ్రితోపాటు పెదనాన్న అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అండదండలతో గెలుపును అందుకున్నారు. 
  • వరంగల్‌ విజేత కడియం కావ్య ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారాసలో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరి కుమార్తెకు టికెట్‌ను సాధించగా ఆమె విజయం సాధించారు.
  • భువనగిరిలో గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాపారవేత్త. 2007లో పార్టీలో చేరిన ఆయన యువజన కాంగ్రెస్‌లో పలు పదవులు నిర్వహించడంతోపాటు పలు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2021 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 

ఎంపీ అభ్యర్థిగా తొలిసారే పోటీ చేసి గెలుపు 

మల్కాజిగిరి నియోజకవర్గంలో భాజపా తరఫున గెలిచిన ఈటల రాజేందర్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. కమలాపూర్‌/హుజూరాబాద్‌ నియోజకవర్గాల నుంచి ఏడుసార్లు గెలిచిన ఆయన మంత్రిగానూ పనిచేశారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు పార్టీ అధిష్ఠానం మల్కాజిగిరి టికెట్‌ ఇవ్వగా బలం నిరూపించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని