చేజారిన ఆ నాలుగు..

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య మునుపటి కన్నా మరో ఐదు పెరిగినప్పటికీ కీలకంగా భావించిన స్థానాలు చేతికి చిక్కలేదు.

Published : 05 Jun 2024 06:57 IST

వ్యూహాత్మకంగా అడుగులేసినా వరించని విజయం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య మునుపటి కన్నా మరో ఐదు పెరిగినప్పటికీ కీలకంగా భావించిన స్థానాలు చేతికి చిక్కలేదు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు ప్రత్యేక వ్యూహం అనుసరించినప్పటికీ కొన్ని స్థానాల్లో నిరాశ మిగిలింది. మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలపై రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.  మల్కాజిగిరిలో అత్యధికంగా తొమ్మిది సభల్లో సీఎం ప్రసంగించారు. చేవెళ్లలో ఏడు, మహబూబ్‌నగర్‌లో ఆరు సభలు నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను కూడా క్షేత్రస్థాయి ప్రచారానికి తీసుకొచ్చారు. భారాస బలంగా ఉన్న మెదక్‌పైనా గురిపెట్టి నాలుగు దఫాలుగా ప్రచారం చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు.  

  • కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానమైన మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఇటీవల భారాస కైవసం చేసుకుంది. ఇక్కడా గట్టిపోటీ ఉంటుందని కాంగ్రెస్‌ అంచనా వేసింది. సీఎం ఉద్ధృతంగా ప్రచారం చేపట్టారు. పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చినా ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. 
  • చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భారాస గెలిచింది. పరిగి, వికారాబాద్, తాండూరు కాంగ్రెస్‌ చేజిక్కడంతో చేవెళ్ల గెలుపుపై కాంగ్రెస్‌ నమ్మకం పెట్టుకుంది.  గట్టి ప్రచారం చేపట్టినా అభ్యర్థి రంజిత్‌రెడ్డి ద్వితీయ స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 
  • సీఎం నాలుగుసార్లు ప్రచారం నిర్వహించిన మెదక్‌ స్థానంపైనా కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఏడు శాసనసభ స్థానాల్లో ఆరింట భారాస గెలిచింది. మెదక్‌ను మాత్రం కాంగ్రెస్‌ దక్కించుకుంది. బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో కాంగ్రెస్‌ బీసీ అభ్యర్థి నీలం మధును బరిలో నిలిపింది. సీఎం ప్రత్యేకంగా ప్రచారం  నిర్వహించారు. ఇక్కడా హస్తం పార్టీ ద్వితీయ స్థానానికే పరిమితమైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని