తెదేపా అభ్యర్థుల హ్యాట్రిక్‌ల పరంపర

ఈసారి తెదేపా తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హ్యాట్రిక్‌ (వరుసగా మూడు సార్లు), డబుల్‌ హ్యాట్రిక్‌ (6 సార్లు) సాధించారు.

Published : 05 Jun 2024 07:17 IST

అత్యధికంగా చంద్రబాబు 8 సార్లు గెలుపు

ఈనాడు, అమరావతి: ఈసారి తెదేపా తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హ్యాట్రిక్‌ (వరుసగా మూడు సార్లు), డబుల్‌ హ్యాట్రిక్‌ (6 సార్లు) సాధించారు. కొందరు అంతకంటే ఘనమైన రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యధికంగా చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి గెలుపొందారు.

  • గంటా శ్రీనివాసరావు తొలుత అనకాపల్లి ఎంపీగా గెలవగా, తర్వాత చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా కలిపి మొత్తం ఆరుసార్లు గెలిచారు. గంటా ప్రతిసారి నియోజకవర్గం మారుస్తారని వాదన ఉంది. ఈసారి భీమిలిలోనే రెండోసారి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు.
  • గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి) ఐదు సార్లు విజయం సాధించారు.
  • వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ తూర్పు), వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట)లు నాలుగేసి సార్లు గెలిచారు.
  • కె.అచ్చెన్నాయుడు (టెక్కలి), బెందాళం అశోక్‌ (ఇచ్ఛాపురం), గణబాబు (విశాఖ పశ్చిమ), చినరాజప్ప (పెద్దాపురం), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), గద్దె రామ్మోహన్‌ (విజయవాడ తూర్పు), అనగాని సత్యప్రసాద్‌ (రేపల్లె), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), డోలా బాలవీరాంజనేయస్వామి (కొండపి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు గ్రామీణ), నందమూరి బాలకృష్ణ (హిందూపురం), గుమ్మనూరు జయరాం (గుంతకల్లు) హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. వీరిలో జయరాం గత రెండు ఎన్నికల్లో ఆలూరు నుంచి వైకాపా తరఫున గెలవగా, ఈసారి తెదేపా అభ్యర్థిగా గుంతకల్లు నుంచి బరిలో నిలిచారు.
  • రాజమహేంద్రవరం గ్రామీణ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి వరుసగా మూడోసారి విజయం సాధించగా, ఇప్పటి వరకు ఆయన పది సార్లు పోటీచేసి ఏడు సార్లు గెలుపొందారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు