తగ్గిన భాజపా ఓట్ల శాతం

గత ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓట్ల శాతం ఈసారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2019లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో భాజపా పోటీ చేసింది.

Updated : 05 Jun 2024 07:38 IST

కాంగ్రెస్, సమాజ్‌వాదీకి పెరిగాయి

దిల్లీ: గత ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓట్ల శాతం ఈసారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2019లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో భాజపా పోటీ చేసింది. కానీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. 36.58శాతం ఓట్లను సాధించింది. మంగళవారం రాత్రి 10.15 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. 0.72 శాతం ఓట్లు భాజపాకు తగ్గాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ 1.76 శాతం ఓట్లను అధికంగా సాధించింది. 2019లో ఆ పార్టీకి 19.46శాతం రాగా ఈసారి 21.22 శాతం ఓట్లు వచ్చాయి.
2019లో 2.55శాతం ఓట్లను సాధించిన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి 4.59శాతం ఓట్లను సాధించింది. ఇది దాదాపు రెట్టింపు.

  • 2019లో జేడీయూకు 1.45శాతం ఓట్లు రాగా ఈసారి 1.25శాతం వచ్చాయి.
  • 2019లో తృణమూల్‌కు 4.06శాతం ఓట్లురాగా ఈసారి 4.38శాతం ఓట్లు వచ్చాయి.
  • బీఎస్పీ ఓట్ల శాతం 2.04 నుంచి 1.58కు తగ్గింది.
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. 
  • డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని