లైవ్‌లో కన్నీరు పెట్టిన ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎండీ

లోక్‌సభ ఎన్నికల్లో తమ అంచనాలు తప్పడంతో యాక్సిస్‌ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్‌ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు.

Published : 05 Jun 2024 07:18 IST

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పినందుకు భావోద్వేగం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తమ అంచనాలు తప్పడంతో యాక్సిస్‌ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్‌ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్‌ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్‌ గుప్తా... ప్యానెల్‌ చర్చ సందర్భంగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంశం గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తమ అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన ఆయన లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిలో భాగంగా యాక్సిస్‌ మై ఇండియా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 361-401 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 131-166 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను దాటి విజయం సాధించినప్పటికీ తాము వేసిన అంచనాకు అసలు ఫలితాలకు పొంతన లేకపోవడంతో ఆయన తమ అంచనా తప్పిందని భావోద్వేగం చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని