తటస్థ పార్టీలకు షాక్‌

లోక్‌సభ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య సాగడంతో తటస్థ పార్టీలకు షాక్‌ తగిలింది. ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేసిన పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Published : 05 Jun 2024 07:19 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య సాగడంతో తటస్థ పార్టీలకు షాక్‌ తగిలింది. ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేసిన పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బీఎస్పీ, తెలంగాణలోని భారాస, ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ఉన్నాయి. 

  • దేశ వ్యాప్తంగా అత్యధికంగా 488 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటూ గెలవలేదు. 2019లో సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుని 10 సీట్లను సాధించింది.
  • ఒడిశాలో 21 సీట్లలో పోటీ చేసిన బిజూ జనతాదళ్‌ ఒక్క చోటా విజయం సాధించలేదు. 2019లో ఆ పార్టీ 12 సీట్లలో గెలిచింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా కేవలం నాలుగు సీట్లలోనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 22 చోట్ల గెలిచింది.
  • తెలంగాణలోని 17 సీట్లలో పోటీ చేసిన భారాస ఒక్క సీటూ గెలవలేదు. 2019లో ఆ పార్టీ 9 చోట్ల విజయం సాధించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని