ఈ నేతలు.. నిర్విరామ విజేతలు

ప్రజాభిమానం దండిగా ఉన్న ఆ నేతలు విజయాన్ని తమ చిరునామాగా మలచుకున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు వారిదే అన్నట్లుగా దూసుకుపోతున్నారు.

Published : 05 Jun 2024 07:20 IST

దిల్లీ: ప్రజాభిమానం దండిగా ఉన్న ఆ నేతలు విజయాన్ని తమ చిరునామాగా మలచుకున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు వారిదే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. అటువంటి వారి జాబితాలో ముందు నిలిచే వ్యక్తి... దళిత నాయకుడు, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌. మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్‌ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఎనిమిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఓబీసీ నేత పంకజ్‌ చౌధరి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ నుంచి ఏడోసారి విజయం సాధించారు. భాజపాకి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులు.. ఇందర్‌జిత్‌ సింగ్‌ (గురుగ్రామ్‌), శివరాజ్‌ చౌహాన్‌ (విదిశ), తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ (ఉత్తర కోల్‌కతా) వరుసగా ఆరోసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అయిదోసారి గెలుపొందారు. శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ భటిండా నుంచి, కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎన్నికయ్యారు. హ్యాట్రిక్‌ సాధించిన వారిలో ప్రధాని మోదీ (వారణాసి), కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (నాగ్‌పుర్‌), కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(లఖ్‌నవూ) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని