కాంగ్రెస్‌ విజయంపై సీపీఐ అభినందనలు

సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో సీపీఐ నేతలు కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 8 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Published : 06 Jun 2024 04:03 IST

రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న కూనంనేని సాంబశివరావు. చిత్రంలో పశ్య పద్మ, ఈటీ నరసింహా, పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో సీపీఐ నేతలు కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 8 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఈటీ నర్సింహ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. భాజపా గెలిచిన 8చోట్ల భారాస డిపాజిట్లు కోల్పోయిందనీ, తద్వారా భారాస ఓట్లు భాజపాకు బదిలీ అయినట్లు అర్థమవుతోందని ఈ సందర్భంగా సీఎం అన్నట్లు కూనంనేని తెలిపారు. 

చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలి

ఏపీ ఎన్నికల ఫలితాల పట్ల తెదేపా అధినేత చంద్రబాబుకు కూనంనేని సాంబశివరావు అభినందనలు తెలిపారు. ఇది నియంతృత్వంపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెదేపా ఇండియా కూటమిలోకి వస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని